టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం(Turkey earthquake) ఘటనపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఇరు దేశాల్లో భూప్రకంపనల దాటికి జరిగిన విధ్వంసం దృశ్యాలు చూసి షాక్ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఆ క్రమంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ బాధను వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Shocked to see the visuals of devastation in Turkey & Syria! Truly a very sad day for humanity
Prayers for strength & wholehearted condolences to the bereaved families 🙏#TurkeyEarthquake
మరోవైపు టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంప బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతంది. రెండు దేశాల్లో మృతుల సంఖ్య 4,500 దాటేసిందని అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన భారత్ ఇప్పటికే పలు రెస్క్యూ బృందాలను పంపించగా, పలు దేశాలు తమకు తోచిన మేరకు సాయం చేస్తున్నాయి.