• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలకు జిల్లా యువకుడు ఎంపిక

విజయనగరానికి చెందిన తెలికిచెర్ల శ్రీతోద్భవ్ షిల్లాంగ్లో ఈ నెల 23 నుండి 27 వరకు జరిగే ఇస్రో NSSS 2026 అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనున్నారు. తాను రాసిన పరిశోధనాత్మక వ్యాసం ” సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ త్రూ కాస్మిక్ లైఫ్ విసబిలిటీ మెట్రిక్” అనే అంశంపై ఇస్రో, పలువురు అంతర్జాతీయ, అంతరిక్ష పరిశోధకులకు వివరించబోతున్నారు.

February 20, 2026 / 01:18 PM IST

BRS కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి

సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో BRS పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకిచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్‌నైనా వాస్తవాల ఆధారంగా రూపొందించి హామీలన్నీ నెరవేర్చాలని చెప్పుకొచ్చారు.

February 20, 2026 / 01:18 PM IST

మున్సిపల్ ఛైర్మన్‌ను సన్మానించిన మాజీ వైస్ ఛైర్మన్

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మున్సిపల్ నూతన ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్‌ను మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ప్రవీణ్ కుమార్‌ తెలిపారు.

February 20, 2026 / 01:18 PM IST

నెక్కొండలో గృహప్రవేశానికి హాజరైన: ఎమ్మెల్యే

WGL: నెక్కొండ (M) కేంద్రంలోని పత్తిపాక తండాకు చెందిన బి రజిత–లక్ష్మణ్ దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని MLA దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 10 సం,రాలు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం ఇళ్లు ఇవ్వలేదని అన్నారు.

February 20, 2026 / 01:17 PM IST

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

NZB: రాజంపేటలో 157వ బూత్ బీజేపీ అధ్యక్షుడు జూకంటి రాజిరెడ్డి తండ్రి, సోదరుడు ఇటీవల అకాల మరణం చెందడంతో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అకాల మరణం చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబానికి అండగా ఉంటామని, ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆయనతో బాటు మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 01:16 PM IST

పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీపీవో

VZM: జిల్లా పంచాయతీ అధికారి డి. వి.మల్లిఖార్జున శుక్రవారం కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. స్వర్ణ పంచాయతీ ఇంటి పన్నుల బకాయిలు 2025, 26 వరకు సంబంధించి రూ 1.48 లక్షలు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ 65 లక్షలు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. పంచాయతీ షాపుల అద్దెలు బకాయిలు ఉన్నాయని, త్వరలో వసూలుకు చర్యలు చేపడతామన్నారు. ఈఓపీఆర్డీ ఉన్నారు.

February 20, 2026 / 01:15 PM IST

‘వచ్చే నెల 31 లోపు దరఖాస్తులు చేసుకోవాలి’

VZM: మెరకముడిదాం మండలంలోని స్దానిక గర్భం AP మోడల్‌ స్కూల్లో 2026- 27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ అరుణకుమారి శుక్రవారం. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 24 నుంచి వచ్చే నెల 31లోపు www.apms.apcfss.in వైబ్‌ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ 12 తేదిన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

February 20, 2026 / 01:15 PM IST

గ్రామపంచాయతీలకు కేంద్రం GOOD NEWS

TG: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి తీపి కబురు చెప్పింది. తాజాగా 15వ ఆర్థిక సంఘం కింద మూడవ విడతలో భాగంగా 387.53 కోట్లు విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదల కాగా రెండో విడత కింద రూ. 387 కోట్లు విడుదల చేసింది. తాజాగా మూడో విడత నిధులు రిలీజ్ చేయడంతో దీంతో ఇప్పటివరకు 1034.42 కోట్లు విడుదలయ్యాయి.

February 20, 2026 / 01:13 PM IST

నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ బాధ్యతలు స్వీకరణ

GDWL: మున్సిపల్ నూతన చైర్‌పర్సన్‌గా తుమ్మల జయలక్ష్మి శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆమెను అభినందించారు. అందరి సహకారంతో గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.

February 20, 2026 / 01:11 PM IST

‘మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి’

AKP: అచ్యుతాపురం మండలంలోని పూడిమడక జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఎస్సై సుధాకర్ విద్యార్థులకు డ్రగ్స్, మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి వంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. అనుమానాస్పద సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి, మోసాలకు గురికావద్దని హెచ్చరించారు.

February 20, 2026 / 01:08 PM IST

జిల్లా యాదమరి సమీపంలో విషాదం

CTR: యాదమరి సమీపంలో బావిలో పడి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ పోలీసు సిబ్బంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

February 20, 2026 / 01:08 PM IST

‘టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను కొనసాగించాలి’

MNCL: రెవిన్యూ శాఖలో ఎంతో కాలంగా పనిచేస్తున్న టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను కొనసాగించాలని అధ్యక్షుడు వెంకటేష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు టీఎన్జీవోస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాల అమలు , ఎన్నికల నిర్వహణలో కృషి చేసిన కంప్యూటర్ ఆపరేటర్లను ఇతర ఉద్యోగాలకు వెళ్లాలనడం కష్టంగా ఉందని తెలిపారు.

February 20, 2026 / 01:07 PM IST

హైవేపై నిర్మాణ పనులు.. దుమ్ముతో ఇక్కట్లు

ASR: 516-ఈ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జీ.మాడుగుల మండలంలో హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పలుచోట్ల మట్టి పనులు చేపట్టారు. నీళ్లతో తడపకపోవడం వల్ల దుమ్ము, ధూళి విపరీతంగా గాలిలోకి లేస్తుంది. చుట్టుపక్కల ఇళ్లలోకి, వాహనదారుల కళ్లలోకి దూరటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు.

February 20, 2026 / 01:06 PM IST

లంచ్ తర్వాత స్వీట్స్ తింటున్నారా?

చాలామందికి భోజనం తర్వాత తీపి తినడం అలవాటు, కానీ దీనివల్ల అనవసరమైన క్యాలరీలు పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది. చక్కెరతో చేసిన స్వీట్లకు బదులుగా ఒక చిన్న ముక్క బెల్లం తినడం ఉత్తమం. ఇది ఆహారం త్వరగా అరిగేలా చేయడమే కాకుండా, శరీరానికి అవసరమైన ఐరన్ అందిస్తుంది. రక్తహీనతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యంతో పాటు తీపి కోరికను కూడా ఇది తీరుస్తుంది.

February 20, 2026 / 01:05 PM IST

‘ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి’

CTR: వాతావరణ మారుతూ ఉందని ఈ క్రమంలో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ మధుసూదనాచారి సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతావరణం పొడిగా మారిందన్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. నిల్వచేసిన ఆహారాన్ని తినటం మానుకోవాలన్నారు. జాగ్రత్తలు పాటించాలన్నారు.

February 20, 2026 / 01:05 PM IST