CTR: యాదమరి సమీపంలో బావిలో పడి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ పోలీసు సిబ్బంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
MNCL: రెవిన్యూ శాఖలో ఎంతో కాలంగా పనిచేస్తున్న టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను కొనసాగించాలని అధ్యక్షుడు వెంకటేష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు టీఎన్జీవోస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాల అమలు , ఎన్నికల నిర్వహణలో కృషి చేసిన కంప్యూటర్ ఆపరేటర్లను ఇతర ఉద్యోగాలకు వెళ్లాలనడం కష్టంగా ఉందని తెలిపారు.
ASR: 516-ఈ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జీ.మాడుగుల మండలంలో హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పలుచోట్ల మట్టి పనులు చేపట్టారు. నీళ్లతో తడపకపోవడం వల్ల దుమ్ము, ధూళి విపరీతంగా గాలిలోకి లేస్తుంది. చుట్టుపక్కల ఇళ్లలోకి, వాహనదారుల కళ్లలోకి దూరటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు.
చాలామందికి భోజనం తర్వాత తీపి తినడం అలవాటు, కానీ దీనివల్ల అనవసరమైన క్యాలరీలు పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది. చక్కెరతో చేసిన స్వీట్లకు బదులుగా ఒక చిన్న ముక్క బెల్లం తినడం ఉత్తమం. ఇది ఆహారం త్వరగా అరిగేలా చేయడమే కాకుండా, శరీరానికి అవసరమైన ఐరన్ అందిస్తుంది. రక్తహీనతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యంతో పాటు తీపి కోరికను కూడా ఇది తీరుస్తుంది.
CTR: వాతావరణ మారుతూ ఉందని ఈ క్రమంలో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ మధుసూదనాచారి సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతావరణం పొడిగా మారిందన్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. నిల్వచేసిన ఆహారాన్ని తినటం మానుకోవాలన్నారు. జాగ్రత్తలు పాటించాలన్నారు.
NLR: అంతర్జాతీయ స్థాయిలో ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. శుక్రవారం అనంతరం ఆయనతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు.
GNTR: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం తెనాలిలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
TG: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రభుత్వం భారీగా పదోన్నతులు కల్పించింది. డిప్యూటీ సీఈవోలుగా ఉన్న 27 మందికి సీఈవోలుగా పదోన్నతులు వచ్చాయి. డిప్యూటీ సీఈవోలుగా ఉన్న మరో 55 మందికి ఎంపీడీవోలుగా ప్రమోషన్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రజా భవన్‌లో అధికారులంతా కలిసి మంత్రి సీతక్కను సన్మానించారు.
SKLM: మండల కేంద్రం సారవకోట జడ్పీటీసీ వి. నాగేశ్వరమ్మ గత రెండేళ్లుగా కార్యాలయం తలుపులు తెరవకపోవడం విశేషం. ఆమె జిల్లా ప్రదేశ్ ప్రాదేశిక సభ్యురాలుగా ఎన్నికై సుమారు 5 ఏళ్ళు అవుతున్నాయని కాలం కూడా దగ్గర అవుతుందని ఆమె కార్యాలయానికి రాకపోవడం తలుపులు తెరవకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
వేసవి ఎండలు మొదలైన నేపథ్యంలో ఏసీలు ఆన్ చేసే సమయం వచ్చేసింది. అయితే వీటిని ఉపయోగించే ముందు ఫిల్టర్లను శుభ్రపరచడం తప్పనిసరి. మొదట విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఫిల్టర్లను జాగ్రత్తగా తొలగించాలి. అనంతరం వాటిని నీటితో కడిగి, పూర్తిగా ఆరిన తర్వాతే తిరిగి అమర్చాలి. దీనివల్ల ఏసీ పనితీరు మెరుగుపడటమే కాకుండా, గాలి నాణ్యత పెరిగి విద్యుత్ కూడా ఆదా అవుతుంది.
CTR: ఉపాధి హామీ పథకంలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను పుంగనూరు పరిధిలో చేపట్టిన పనులపై ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్ సామాజిక తనిఖీ నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లా ఆవరణంలో కార్యక్రమం జరిగింది. సామాజిక తనిఖీల్లో ఏ ఏ గ్రామాల్లో ఎంత మేరకు తప్పిదాలు చోటు చేసుకున్నదని సామాజిక తనిఖీ బృందాలు అధికారులకు వివరించారు.
KRNL: జిల్లా అధ్యక్షురాలు గుడిసే కృష్ణమ్మ క్యాంప్ కార్యాలయలో పలు నియోజకవర్గాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా వారు స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించి వినతిపత్రాలు సమర్పించారు. ప్రతి ఒక్కరి అభ్యర్థనను శ్రద్ధగా విని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణమ్మ హామీ ఇచ్చారు.
NGKL: తెల్కపల్లి మండలం కార్వంగ గ్రామంలో నూతన సీసీ రోడ్లకు శుక్రవారం ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్వంగ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కలుగుతుందన్నారు.
NZB: భీమగల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్, డ్రై స్వీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు దారులు స్థానికులై ఉండాలని, 7వ తరగతి బోనాఫైడ్ జతచేసి పాఠశాలలో అందజేయాలని కోరారు.
ATP: గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో నాటు స్థావరం స్థావరంపై శుక్రవారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఎస్సై అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమకు రాబడిన సమాచారంతో గ్రామంలో నాటు సారా తయారీ కేంద్రంపై దాడులు చేశామన్నారు. సుమారు 30 లీటర్ల నాటు సార ఊటను ధ్వంసం చేశామన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.