జయనగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితుడు నగేష్ (పేరు మార్చాం) అన్నమ్మకు తన స్నేహితుడిగా పరిచయం అయ్యాడు. అన్నమ్మ ఐదేళ్ల కుమారుడికి క్యాన్సర్ ఉందని, అందుకే తనకు డబ్బు అవసరమని నగేష్ దగ్గర వాపోయింది. అదే రోజు నగేష్, అన్నమ్మ ఓ హోటల్లో కలుసుకున్నారు.
Honeytrap:ఇద్దరు మహిళలతో స్నేహం చేసిన ఓ వృద్ధుడు హనీట్రాప్‌లో చిక్కుకుని రూ.82 లక్షలు పోగొట్టుకున్నాడు. బెంగళూరులో ఉంటున్న ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి ఇద్దరు మహిళలు దగ్గరయ్యారు. నమ్మిన అతడితో అభ్యంతరకరమైన వీడియోలు తీసి రూ.82లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసులో దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు మహిళలు, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళలు రీనా అన్నమ్మ (40 ఏళ్లు), స్నేహ (30). స్నేహ భర్త లోకేష్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఈ ప్రణాళికలో వారికి మద్దతు ఇచ్చాడు.
జయనగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితుడు నగేష్ (పేరు మార్చాం) అన్నమ్మకు తన స్నేహితుడిగా పరిచయం అయ్యాడు. అన్నమ్మ ఐదేళ్ల కుమారుడికి క్యాన్సర్ ఉందని, అందుకే తనకు డబ్బు అవసరమని నగేష్ దగ్గర వాపోయింది. అదే రోజు నగేష్, అన్నమ్మ ఓ హోటల్లో కలుసుకున్నారు. నగేష్ కూడా అన్నమ్మకు రూ.5వేలు ఇచ్చాడు. ఆ తర్వాత చాలాసార్లు ఆ మహిళ నగేష్ నుంచి డబ్బులు తీసుకుంది. మే మొదటి వారంలో అన్నమ్మ హుస్కూర్ గేట్‌లోని ఓ హోటల్‌కు నగేష్‌ను పిలిచింది. శారీరక సంబంధం పెట్టుకోవాలని అన్నమ్మ కోరిందని, అయితే అందుకు నిరాకరించానని నగేష్ పేర్కొన్నాడు. తనను బెదిరించి బలవంతంగా సెక్స్‌లో పాల్గొనేలా చేశారని నగేష్ ఆరోపించారు. ఆ తర్వాత ఒకే హోటల్లో చాలాసార్లు కలుసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అన్నమ్మ తన స్నేహితురాలైన స్నేహకు పరిచయం చేసింది. దీని తర్వాత స్నేహ కూడా నగేష్ దగ్గర డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టింది.
అన్నమ్మ, స్నేహ ఇద్దరూ కలిసి నగేష్‌ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తమ వద్ద ప్రైవేట్ మూమెంట్స్ వీడియోలు ఉన్నాయని వారిద్దరూ చెప్పారు. తమ డిమాండ్ నెరవేరకపోతే ఆ వీడియోలను నగేష్ బంధువులకు పంపిస్తామన్నారు. నగేష్ నుంచి స్నేహ రూ.75 లక్షలు డిమాండ్ చేసింది. స్నేహ అతనికి కొన్ని వీడియోలు కూడా పంపింది. నగేష్ తన పీఎఫ్ ఖాతా నుంచి రూ.82 లక్షలు విత్‌డ్రా చేసి అన్నమ్మ, స్నేహ ఖాతాకు బదిలీ చేశాడు.
కొద్ది రోజుల తర్వాత మహిళలిద్దరూ నగేష్‌ను రూ.42 లక్షలు డిమాండ్ చేశారు. మొదట డబ్బులు ఇస్తే వెళ్లిపోతుందని భావించిన నగేష్.. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దోపిడీ, నేరపూరిత కుట్ర, పరువు నష్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి వారి ఖాతాల్లో జమ చేసిన రూ.25 లక్షలను స్తంభింపజేసినట్లు డీసీపీ (సౌత్) పి.కృష్ణకాంత్ తెలిపారు. దీంతో పాటు వారి నుంచి 300 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురూ సాధారణ నేరస్తులని ఇంతకుముందు చాలా మందిని మోసం చేశారని తెలుస్తోంది. లోకేష్ స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా స్నేహకు ఏడాది వయసున్న పాప ఉంది. తన భర్త ఏడాది క్రితమే చనిపోయాడని అన్నమ్మ చెబుతోంది. ఆ తర్వాత వ్యక్తులతో స్నేహం చేస్తూ మోసం చేయడం ప్రారంభించారు.