DK Shivakumarతో కోమటిరెడ్డి భేటీ.. షర్మిల చేరికపై చర్చ
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సోనియాగాంధీ సుముఖంగా ఉన్నారని టీ కాంగ్రెస్ ముఖ్యనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల చేరికపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ హై కమాండ్‌తో చర్చ జరిగిందని.. చేరిక లాంఛనమే అనే వార్తలు గుప్పుమన్నాయి. జూలై 8వ తేదీన షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు డీకే శివకుమార్- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) సమావేశం అయ్యారు. వీరి భేటీలో కూడా షర్మిల పార్టీలో చేరిక గురించి చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) సమావేశం అయ్యారు. ఇరు రాష్ట్ర రాజకీయాలపై ఇద్దరు నేతలు మాట్లాడారు. వీరి సమావేశం 40 నిమిషాలు కొనసాగింది. ఇందులో ఎక్కువగా షర్మిల పార్టీలో చేరిక గురించి మాట్లాడారు. షర్మిల పార్టీలోకి వచ్చేందుకు హైకమాండ్ సానుకూలంగా ఉందని డీకే శివమాకుర్ చెప్పారట. షర్మిల పార్టీలోకి తీసుకోవడానికి సోనియా గాంధీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వివరించారు.
షర్మిలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. నేతల్లో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో షర్మిలను పార్టీలో చేర్చుకునే విషయమై హైకమాండ్ ఆరా తీస్తోంది. దాంతోపాటు ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకుంటామని హై కమాండ్ స్పష్టంచేసిందని సమాచారం. షర్మిల గురించి ఢిల్లీ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినందున ఆమె చేరిక లాంఛనమేనని మేధావులు అంటున్నారు.
ತೆಲಂಗಾಣದ ಭುವನಗಿರಿ ಸಂಸದರಾದ ಶ್ರೀ ಕೋಮಟಿ ರೆಡ್ಡಿ ವೆಂಕಟ ರೆಡ್ಡಿ ಅವರು ಇಂದು ಬೆಂಗಳೂರಿನ ಕುಮಾರಕೃಪಾ ಅತಿಥಿ ಗೃಹದಲ್ಲಿ ನನ್ನನ್ನು ಭೇಟಿ ಮಾಡಿ ಶುಭ ಹಾರೈಸಿದರು. ಈ ವೇಳೆ ಉಭಯ ರಾಜ್ಯಗಳ ಪ್ರಸ್ತುತ ರಾಜಕೀಯ ವಿದ್ಯಾಮಾನಗಳ ಕುರಿತು ಚರ್ಚಿಸಲಾಯಿತು. pic.twitter.com/C5bexLQcxi
ఇటీవల డీకే శివకుమార్‌ను షర్మిల రెండు సార్లు కలిశారు. ఓ సారి డీకే బర్త్ డే సందర్భంగా విష్ చేశారు. మరోసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఆ సమయంలో డీకేను షర్మిల కలిసి విష్ చేసింది. డీకే శివకుమార్‌తో షర్మిల ఫ్యామిలీకి వైఎస్ఆర్ బతికి ఉన్న సమయం నుంచి అనుబంధం ఉంది. ఆ చనువుతోనే షర్మిల డీకేను కలిశారు.