శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి శబరిమల మధ్య నవంబర్ 16 నుంచి 20వరకు యాత్ర ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు IRCTC శబరిమల యాత్ర- భారత్ గౌరవ్ టూరిస్టు ట్రైన్ బ్రోచర్‌ను ద.మ.రైల్వే GM అరుణ్ కుమార్ విడుదల చేశారు. అయ్యప్ప స్వామి ఆలయం, చోటానికర్ భగవతి ఆలయాలను కవర్ చేస్తూ యాత్ర కొనసాగనున్నట్లు తెలిపారు.