TG: హైదరాబాద్లో కనీస మౌలిక వసతులు లేవని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పేద ప్రజల ఇళ్ల జోలికి పోకుండా మూసీ పునరుజ్జీవనం చేస్తే బీజేపీ కరసేవ చేస్తోందని అన్నారు. మూసీ పునరుజ్జీవనానికి రూ.లక్షన్నర కోట్లు కావాలని ప్రకటించారు. ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మిస్తామని గత సీఎం మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.