AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఇసుక, మద్యం జోలికి వెళ్లవద్దని గట్టిగా హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు చేయాల్సిందేనని చెప్పారు. దీనికి సంబంధించి సమస్య ఎక్కడుందో చెప్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.