మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ MP ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో ఆయన బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కర్నాటక హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో ప్రజ్వల్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.