చలికాలంలో వచ్చే పలు అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు కొన్ని ఆహారపదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలని పోషకార నిపుణులు చెబుతున్నారు. చెరుకు రసం, రేగుపండ్లు, చింతపండు, ఉసిరి, నువ్వులు, ఖర్జూరాలు, చిరుధాన్యాలు తీసుకోవాలి. వీటిలోని పోషకాలు కాలేయ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఎముకలు, కీళ్లు బలంగా ఉండేలా చేస్తాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరవు. శరీరానికి వెచ్చదనం అందుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది.