»Fastrack Calling Fs1 Smartwatch For Rs 1995 It Also Tells The Heart Pulse
Smartwatch: రూ.1995కే ఫాస్ట్రాక్ కాలింగ్ స్మార్ట్‌వాచ్..హార్ట్ పల్స్ కూడా చెప్పేస్తుంది
ప్రముఖ గడియారాల సంస్థ ఫాస్ట్రాక్(Fastrack) నుంచి అదరిపోయే లిమిట్లెస్ FS1 స్మార్ట్‌వాచ్(Smartwatch) ఇండియా మార్కెట్లోకి వచ్చింది. అయితే దీని ధర రెండు వేల రూపాయల్లోపే ఉండటం విశేషం. అంతేకాదు హార్ట్ పల్స్ రేట్, కాలింగ్ వంటి అనేక ఫీచర్లు కూడా అదిరిపోయేలా ఉన్నాయి.
ప్రముఖ భారతీయ ఫ్యాషన్ యాక్సెసరీ రిటైల్ బ్రాండ్ ఫాస్ట్రాక్(Fastrack) శుక్రవారం ఇండియాలో లిమిట్లెస్ ఎఫ్ఎస్1 స్మార్ట్ వాచ్(Smartwatch)ని మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న అనేక బ్రాండ్లకు పోటీగా ఉండేందుకు సరసమైన ధరలకే(రూ.1,995) స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో వచ్చింది. ఇది వినియోగదారుల మణికట్టు నుంచి నేరుగా వాయిస్ కాల్లు చేయడానికి, స్వీకరించడానికి అనుమతిస్తుంది. అయితే ఫాస్ట్రాక్ లిమిట్లెస్ FS1 బ్లాక్, బ్లూ, పింక్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇది ఏప్రిల్ 11 నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆన్ లైన్ సేల్‌లో లభించనుంది. ఈ గాడ్జెట్ 1.95-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు అధునాతన ATS చిప్సెట్, 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌ల సపోర్ట్ వంటీ ఫీచర్లను కూడా ఈ స్మార్ట్ వాచ్ కి ఉండటం విశేషం.
ఫాస్ట్రాక్ లిమిట్లెస్ FS1(specifications)
ఫాస్ట్రాక్ లిమిట్లెస్ FS1 300mAh బ్యాటరీని కలిగి ఉంది
ఒక్క ఛార్జ్‌పై గరిష్టంగా 10 రోజులు వినియోగించుకునే అవకాశం
ఈ స్మార్ట్‌వాచ్‌లో హృదయ స్పందన పర్యవేక్షణకు మద్దతుగా సెన్సార్లు కూడా అమర్చబడి ఉండటం విశేషం
ఇది వాకింగ్, రన్నింగ్ స్ప్రింటింగ్తో సహా 100కి పైగా స్పోర్ట్స్ మోడ్లకు సపోర్ట్ ఇస్తుంది
ఇది ఒత్తిడి, పీరియడ్స్, నిద్రను ట్రాక్ చేయడానికి కూడా ఉపయోగపడనుంది
స్మార్ట్ వాచ్ స్క్రీన్ 240×296 రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్నెస్
నావిగేషన్ కోసం సైడ్-మౌంటెడ్ బటన్‌ను కలిగి ఉంటుంది
వినియోగదారులు వారి వాచ్ నుంచి నేరుగా కాల్‌లను స్వీకరించడం, లేదా అనుమతించే బ్లూటూత్ కాలింగ్ సౌకర్యం
ఫాస్ట్రాక్ అధునాతన ATS చిప్సెట్
ఇది అమెజాన్ అలెక్సా సపోర్ట్ సిస్టమ్ తో వస్తుంది. వినియోగదారులకు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ ఎంపికను అందిస్తోంది.
ఫాస్ట్రాక్ లిమిట్లెస్ FS1 బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉంది