AP: టీటీడీ పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఇవాళ నివేదికను హైకోర్టుకు అందజేయనుంది. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన, ఈవో ధర్మారెడ్డిలతో పాటు పలువురిని విచారించారు. ఈ కేసులో సుమారు 30 మందిని విచారించి నివేదిక సిద్ధం చేశారు.