GNTR: గుంటూరులోని పొన్నూరు రోడ్లో ఆంధ్రా ముస్లీం కళాశాలలో మెగా జాబ్ మేళా బుధవారం జరుగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మంగళవారం తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహిస్తున్నారు. యువత, నిరుద్యోగులు తప్పక హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు.