NLR: ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కుల పథకం కింద నెల్లూరు జిల్లాలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసిందనేది వాస్తవమేనా అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరా తీశారు. మంగళవారం లోక్ సభలో ఈ మేరకు పలు ప్రశ్నలు వేశారు. ప్రాజెక్టు వ్యయం రూ. 103 కోట్లు కాగా.. పార్కులో 10 యూనిట్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై ఆయన ప్రశ్నించారు.