KMR: జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పించడం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి 2026 జనవరి 12 వరకు 6 వారాలు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.