బాలకృష్ణ ‘అఖండ-2’ చిత్రానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ చిత్ర టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ చిత్రం ఈనెల 5న విడుదల కానుండగా, 4వ తేదీన ప్రీమియర్ షో (రూ.600) ప్రదర్శించడానికి కూడా అనుమతినిచ్చింది. అలాగే, సినిమా విడుదల తేదీ నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున పెంపునకు అనుమతిచ్చింది.