సత్యసాయి: ఈనెల 5న జరగనున్న పేరెంట్స్-టీచర్స్ సమావేశంలో విద్యార్థుల అభ్యాస పురోగతి, హాజరు, ప్రవర్తన వివరాలను తల్లిదండ్రులకు సమగ్రంగా వివరించడమే లక్ష్యమని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.