AP: రేపు సుప్రీంకోర్టులో అమరావతిపై గత ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. అమరావతే ఏకైక రాజధాని అంటూ గతంలో హైకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ గత ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై రేపు విచారణ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నట్లు కూటమి ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అమరావతే ఏకైక రాజధాని అంటూ అఫిడవిట్లో స్పష్టం చేసింది.