TG: గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాష్ట్రంలో విద్యా రంగం నిర్వీర్యమైందని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యా రంగాన్ని గాడిలో పెట్టేందుకు, దాన్ని పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా.. ‘విద్యా కమిషన్’ను ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతికి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.