చుండ్రు సమస్య చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని నూనెలు డాండ్రఫ్ని అరికడతాయని నిపుణులు చెబుతున్నారు. పావుకప్పు కొబ్బరినూనెలో స్పూను టీట్రీ ఆయిల్ కలిపి తలకి పట్టించాలి. కొబ్బరి లేదా ఆలివ్ నూనెలో రోజ్మెరీ ఆయిల్ కలిపి రాసుకోవాలి. ఇలా చేస్తే చుండ్రు తగ్గటంతో పాటు జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఆర్గన్ ఆయిల్ రాస్తే మాడుపై పొట్టు రాలటం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు పొడిబారటం తగ్గి, పట్టులా మారుతుంది.