కొన్ని చిట్కాలతో కళ్లు పొడిబారకుండా జాగ్రత్తపడవచ్చు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడేటప్పుడు మధ్య మధ్యలో కాస్త రెస్ట్ తీసుకోవాలి. అలాగే కాంటాక్ట్ లెన్సులను వాడితే మంచిది. గోరువెచ్చని నీటితో ఎప్పటికప్పుడు కళ్లను శుభ్రం చేసుకోవాలి. నీళ్లు అధికంగా తాగాలి. కీరా, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, అవకాడో, వాల్నట్స్, బాదం వంటివి తినాలి. బయటకెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి.