జంతువుల నుంచి వచ్చే పాలకు ప్రత్యామ్నాయంగా సోయామిల్క్ వాడుతుంటారు. సోయా గింజలను నుంచి ఉత్పత్తి చేసే ఈ పాలల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సోయా పాలల్లోని కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఈ పాలు తాగితే త్వరగా ఆకలి వేయదు. కాబట్టి బరువు నియంత్రణలో ఉంటుంది. చర్మం మీద మచ్చలు తగ్గుతాయి. చర్మం తేమగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. సోయాపాలలో ఉండే మోనోసాచురేటెడ్ కొవ్వులు గుండె వ్యాధులను దరిచేరనీయవు.