»Eating Too Much Chicken Beware It Can Also Cause Dangerous Diseases In The World
chicken: రోజు చికెన్ తింటున్నారా..? మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే..!
మీకు చికెన్ అంటే ఇష్టమా..? ముక్క లేనిదే ముద్ద దిగదా..? అయితే కాస్త ఆగండి, చికెన్ తీసుకోవడాన్ని కాస్త తగ్గించండి.. లేదంటే అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉంది.
Eating too much chicken? Beware..it can also cause dangerous diseases in the world
chicken: చికెన్ (chicken) లేకుండా మీ రోజు పూర్తి కాదా? మీకు లంచ్ లేదా డిన్నర్ కోసం చికెన్ తీసుకునే అలవాటు ఉంటే, మీరు కచ్చితంగా ఈ వార్తను చదవాలి, ఎందుకంటే ఎక్కువ చికెన్ తినే అలవాటు ఒకరోజు మిమ్మల్ని ఆసుపత్రి పాలు చేసే ప్రమాదం ఉంది. అవును.. చికెన్‌ని ఎక్కువగా తినడం వల్ల ప్రపంచంలో పదవ ప్రమాదకర వ్యాధి బారిన పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
ప్రమాదకర వ్యాధి
చికెన్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ లేదా AMR అనే ప్రమాదకరమైన వ్యాధి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇది ప్రపంచంలో పదో ప్రమాదకర వ్యాధి. చికెన్ తినడం వల్ల త్వరగా ఏఎంఆర్ బారిన పడుతున్నారని తెలిసింది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ దీనిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీస్ ఆఫ్ ది పౌల్ట్రీ ఇండస్ట్రీ (IVPI) పూర్తిగా ఖండించింది.
పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లకు యాంటీ బయాటిక్స్.. కానీ
చికెన్‌లో ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ పోషకాలు మిమ్మల్ని ఎలా అనారోగ్యానికి గురి చేస్తాయి? అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఈ రోజుల్లో కోళ్లకు యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల అవి ఆరోగ్యంగా, తాజాగా ఉంటాయి. కోడి శరీరంలో యాంటీబయాటిక్స్ చాలా పేరుకుపోతాయి. ఇది చికెన్ తినేవారి శరీరంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ చికెన్ తింటే చికెన్ లోపల ఉండే యాంటీబయాటిక్ తిన్నవారి శరీరంలో పేరుకుపోతుంది.
యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుందా..?
యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ శరీరంలో పెరగడం ప్రారంభం అవుతుంది. ఇలా చికెన్ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ పెరగడం ప్రారంభం అవుతుంది. దాని ప్రభావం ఏమిటంటే శరీరంపై యాంటీబయాటిక్స్ ప్రభావం తగ్గడం ప్రారంభం అవుతుందట. చికెన్ తిన్న తర్వాత శరీరంలోకి ప్రవేశించే యాంటీ బయాటిక్స్ కొంతకాలం తర్వాత యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ AMRగా మారుతుందని, అలాంటి పరిస్థితిలో శరీరం అనేక రకాల ఇన్ఫెక్షన్లకు లోనవుతుందట. ఈ ఇన్ఫెక్షన్లకు చికిత్స చాలా కష్టం, అసాధ్యం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సో.. మీరు చికెన్ ప్రియులు అయితే.. దానికి కాస్త దూరంగా ఉండండి. లేదంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్న వారు అవుతారు.