TG: రాష్ట్రంలో సమగ్ర కులగణన సర్వే కొనసాగుతోంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి కులగణన సర్వేపై సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కులగణన జరగాలని సీఎం రేవంత్ పేర్కొన్న విషయం తెలిసిందే. కేంద్రం మెడలు వంచి కులగణన జరిపి రిజర్వేషన్లు తీసుకొస్తామని ఆయన గతంలో వెల్లడించారు.