TG: హెచ్సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా HCU విద్యార్థులకు చూపిన పోరాట స్ఫూర్తిని ఆయన అభినందించారు. యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. విద్యార్థుల ఆందోళనకు మద్ధతుగా నిలిచిన రాజకీయ పార్టీలను కూడా కేసీఆర్ ప్రశంసించారు.