»Dharani Cheating Everything Was Free Then Now Everything Is Charge
Dharani:తో రైతులను దగా చేస్తున్న ప్రభుత్వం..మొదట ఫ్రీ..ఇప్పుడేమో దోపిడీ
Dharani:ధరణితో భూసమస్యలకు చెల్లుచీటీ.. రైతులు ఏ అధికారి దగ్గరకు వెళ్లకుండానే సమస్యలు పరిష్కరించుకుంటారు’ అని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. కానీ పరిస్థితి ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉంది.
Dharani:ధరణితో భూసమస్యలకు చెల్లుచీటీ.. రైతులు(Farmers) ఏ అధికారి దగ్గరకు వెళ్లకుండానే సమస్యలు పరిష్కరించుకుంటారు’ అని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. కానీ పరిస్థితి ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉంది. సమస్యల పరిష్కారాల కంటే వివాదాలే ఎక్కువగా ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో 2022 ఏప్రిల్ 29న 11రకాల సమస్యలను పరిష్కరించడానికి, పాసుపుస్తకం(passbook)లో సవరణలు చేయడానికి ఒక మాడ్యూల్(module)ను రూపొందించారు. దీనిలో అధికారులు చేసిన తప్పిదాలకు రైతులు మూల్యం చెల్లించుకోవాల్సివస్తున్నది. అధికారులు చేసిన తప్పులను సవరించేందుకు రైతుల దగ్గర అదనంగా ఫీజులు వసూలు చేయడం శోచనీయమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాడ్యూల్ కింద 11 రకాల సమస్యల పరిష్కారం దరఖాస్తుదారులు ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాలి. మీ-సేవ(Mee seva)లో అదనంగా రూ.650 వసూలు చేస్తున్నారు. దీంతోపాటు ఈ మాడ్యూల్ లోని అంశాలను సవరిం చాలంటే విడిగా వెయ్యి రూపాయలు చెల్లించాలి. ఎన్ని అంశాలను సవరించాలంటే అన్ని వేలు చెల్లించాల్సిందే. ఈ 11 అంశాల్లో పేరు, జెండర్, భూమి కేటగిరి, ఆధార్ నెంబర్, భూమి పట్టా, సీలింగ్, భూదాన్, అసైన్డ్ వంటివి తప్పుగా నమోదైతే సరిదిద్దాలి.
భూమి వర్గీకరణ(మెట్ట, మాగాణి), భూమి రకం(ఏ రకంగా సంక్రమించిందో) వివరాలు, ల్యాండ్ ఎంజాయిమెంట్ (సొంతమా? వారసత్వమా? ఎవరు అనుభవిస్తున్నారు), పరిధి దిద్దుబాటు, వాస్తవ విస్తీర్ణం కన్నా పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైతే చేయడం, మిస్సింగ్ సర్వే నెంబర్లు, పాసుపుస్తకంలో కనిపించని సర్వే నెంబర్లు తిరిగి రాయడం వంటివాటిని సరిచేయాలి. కానీ వీటిల్లో ఏదీ సరిగ్గా జరగడంలేదు. ఇచ్చిన ఫిర్యాదుకు ట్రాకింగ్ వ్యవస్థ లేదు. సమస్యల పరిష్కారానికి చేసే ప్రతి దరఖాస్తుకు వేలల్లో ఖర్చు అవుతుంది. దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం కావడం లేదు, చెల్లించిన సొమ్ము తిరిగి రావడం లేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా తిరస్కరిస్తూ.. మళ్లీ దరఖాస్తు చేసుకోమని చెబుతున్నారు తప్ప.. సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే లక్షల దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. సుమారు మరో 5-10 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ధరణి అనేది ప్రభుత్వానికి రోజువారి ఆదాయ వనరుగా మారిందనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తం అవుతున్నది. రాష్ట్రంలో ధరణి వెబ్ పోర్టల్(Dharani webportal) అందుబాటులోకి వచ్చాక భూ వివాదాలు నిత్యకృత్యంగా మారాయని అనేక మంది రైతులు చెబుతున్నారు.
ధరణి వెబ్సైట్ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒక వ్యక్తి చనిపోయినా అతని పేరు మీద పాస్ బుక్ వచ్చిందంటే ధరణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై 37,828 వివాదాలు ఉన్నాయి. పాస్ పుస్తకంలో తక్కువ విస్తీర్ణం ఉన్నట్లు 45,803, ఎక్కువ విస్తీర్ణం ఉన్నట్లు 37,998 ఉన్నాయి. ఈ రెండు వివాదాల కారణంగా రైతుల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. 18,206 పట్టాదారు ఫోటో తప్పుగా మరియు 17,069 పేరు తప్పుగా ఉన్నవి. ఫొటోలు తీసి, పేర్లు తప్పుగా రాస్తున్నారని అధికారులు విమర్శల పాలవుతున్నారు. 34,815 మందివి ఒకే ఖాతా రెండుసార్లు రాశారు, 12,682 మంది సర్వే నంబర్లు తప్పుగా పడ్డవి. 10,879 మంది అటవీ శాఖతో వివాదంలో ఉన్న భూములకు పాసుపుస్తకాలు జారీ చేశారు. 7,431 మంది వ్యవసాయేతర భూములకు పాసుపుస్తకాలు ఇచ్చారు, 4,116 మంది అసైన్డ్ భూములు విక్రయించినందుకు పాస్ పుస్తకాలు ఇచ్చారు. మొత్తం 2,65,653 వివాదాలు ఉన్నాయి.