పప్పు దినుసులు శరీరానికి ఎంతో శక్తిని అందిస్తాయి. అందులోనూ మినప పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. రక్తహీనత, మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. ముఖ్యంగా విరిగిన ఎముకలు, కీళ్లవాతం ఉన్నవారికి ఇది మంచి మెడిసిన్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మినప పప్పుని వారానికి మూడుసార్లైనా ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.