మందార పువ్వుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మందార పువ్వులను ఎండబెట్టి వాటితో టీ తయారు చేసుకుని రోజూ ఒక కప్పు తాగవచ్చు. మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలోని కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. బీపీ తగ్గడంతోపాటు కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. ఇది లివర్‌లోని వ్యర్థాలను బయటకు పంపి డిటాక్స్ చేస్తాయి. లివర్‌ను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించుకోవచ్చు.