TG: సరైన శిక్షణ లేకపోవటం వల్ల యువత పెడదారి పడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ యూత్ డే సదస్సులో పాల్గొని మాట్లాడారు. ‘BRS హయాంలో విద్య, వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు రోగులను నిలువుదోపిడి చేస్తున్నాయి. పెద్ద పెద్ద ఆస్పత్రులు కట్టటం కాదు.. ఆస్పత్రులు అవసరం లేని పరిస్థితి తీసుకురావాలి’ అని అన్నారు.