TG: శ్రీరామనవమి సందర్భంగా HYDలోని సీతారాంబాగ్లో సీతారాముల కళ్యాణమహోత్సవం జరగుతోంది. కళ్యాణం అనంతరం శోభాయాత్ర నిర్వహించనున్నారు. సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు 6.2 కి.మీల మేర యాత్ర సాగనుంది. ఇందుకోసం 20వేల మంది పోలీసులతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో HYDలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.