TG: సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం అన్నారు. అణచివేత మీ విధానం అయితే, ఎదిరించడం తమ నైజం అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. మీ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదని హెచ్చరించారు. ప్రజా క్షేత్రంలో పాలన వైఫల్యాలను బట్టబయలు చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.