అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలోనే మునుపటి కంటే దూకుడుగా వ్యవహరించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. తొలిరోజే 25 దస్త్రాలు.. ఇమిగ్రేషన్ నుంచి ఇంధనం వరకు కీలక అంశాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తన బృందానికి సూచనలు చేసినట్లు సమాచారం. జో బైడెన్.. తొలిరోజు 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.