AP: మాజీ హోంమంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆమె తన భర్త దయాసాగర్తో కలిసి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుతో ఇటీవల చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. నాగబాబు స్విట్జర్లాండ్ పర్యటన అనంతరం సుచరిత జనసేనలో చేరుతారని ఇటు వైసీపీ, జనసేన శ్రేణులు చెప్పుకొస్తున్నారు.