AP: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. కృష్ణా నదిపై 3.2 కి.మీ మేర రైల్వే వంతెన, రూ.2,245 కోట్లతో.. 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ మంజూరు చేసింది. హైదరాబాద్, చెన్నై, కోల్ కతా, నాగ్ పూర్‌ను రైల్వే లైన్ కలుపనుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా.. నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌కు ఆమోదం తెలిపింది. ఈ రైల్వే లైన్‌తో దక్షిణ, మధ్య, ఉత్తర భారత్‌తో అనుసంధానం మరింత సులువు కానుంది.