కృష్ణ జింకల్ని చంపిన విషయంలో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతోంది. తాజాగా మరో సారి బెదిరించడంతో సల్మాన్‌కు భద్రత మరింత పెంచారు. అయితే బిగ్ బాస్ షూటింగ్లో పాల్గొన్న సల్మాన్ కంటెస్టంట్లతో మాట్లాడుతూ ‘ అసలు ఈ వారం రాకూడదు అనుకున్నా, ఎవ్వరినీ కలవకూడదని భావించానంటూ’ వెల్లడించారు. పని మీద ఉన్న నిబద్ధత మూలంగానే వచ్చానని తెలిపారు.