తమ అణుశక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందుకు వ్యూహాత్మక క్రూజ్ క్షిపణిని ప్రయోగించామని ఉత్తర కొరియా తెలిపింది. ఆ దేశంలోని పశ్చిమ తీరంలో జరిగిన ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్ జోంగ్ పర్యవేక్షించారని కొరియన్ సెంట్రల్ ఏజెన్సీ పేర్కొంది. ఈ ఏడాదిలో ఇది నాలుగో క్షిపణిని ప్రయోగం. కాగా, ట్రంప్ ప్రభుత్వం తమ జోలికి వస్తే దీటుగా స్పందిస్తామని కిమ్ ప్రభుత్వం హెచ్చరిస్తూ వస్తోంది.