AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ మొత్తం రూ.48,340కోట్లు కేటాయించారు. వ్యవసాయం లాభదాయకంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అచ్చెన్న తెలిపారు. టెక్నాలజీ ఉపయోగించి సాగు ఖర్చు తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.