NDL: ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ఇవాళ ఉదయం సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, టీజీ భరత్ పాల్గొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టే 2025-26 పూర్తిస్థాయి బడ్జెట్‌కు వారు ఆమోదం తెలిపారు. కాగా, మంత్రి పయ్యావుల శాఖల వారిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.