కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత పరిశ్రమలు లేక ఉపాధి కోల్పోయిన యువత ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళ్తున్నారు అని కూటమి ప్రభుత్వం వెంటనే జిల్లా అభివృద్ధి కోసం 10 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.