AP: భోగాపురం విమానాశ్రయంపై క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని జగన్ విమర్శించారు. విమానాశ్రయం కోసం 2014-19 పాలనలో TDP 10వేల ఎకరాల భూదోపిడీకి ప్లాన్ చేసిందని.. తాము 2700 ఎకరాలకు కుదించి భూసేకరణ పూర్తిచేశామని పేర్కొన్నారు. స్థానికులను తరలించి వారికి కాలనీలు కట్టించామన్నారు. తాము ఇంత చేస్తే అంత వారే చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నాని దుయ్యబట్టారు.