AP: ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులతో కేంద్ర, రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశం ఢిల్లీలో 8 గంటలకుపైగా జరగగా.. ఒప్పందంపై వారందరూ చర్చించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ.15 వేల కోట్లు ఇవ్వనున్నాయి. ఈ మేరకు రెండు సంస్థలతోనూ కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. భేటీలో అధికారులు అవగాహన ఒప్పంద పత్రాలను రూపొందించారు. కాగా, త్వరలో నిధులు విడుదల చేస్తామని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ తెలిపాయి.