కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. ఆమె సోదరుడు రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ స్థానం నుంచి ఎన్నికలకు అరంగేట్రం చేస్తున్నారు. 14 లక్షల మంది ఓటర్ల మద్దతు కోసం కాంగ్రెస్ నుంచి ప్రియాంక, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్ సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.