సినీ నటుడు, వైసీపీ నేత అలీ ఇంట ఇటీవల శుభకార్యం జరిగిన సంగతి తెలిసిందే. అలీ కుమార్తె పెళ్లిని అంగ రంగ వైభంగా జరిపించారు. ఈ పెళ్లి కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే… పవన్ మాత్రం హాజరుకాలేదు. దీంతో… పవన్ కావాలనే రాలేదని కొందరు…. అసలు.. అలీ పిలవలేదు.. అందుకే రాలేదని మరికొందరు కామెంట్స్ చేశారు. దీంతో… ఆ వార్తలకు, కామెంట్లకు అలీ చెక్ పెట్టారు.
ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పెళ్లికి ఎందుకు రాలేదో క్లారిటీ ఇచ్చారు. తన కూతురి పెళ్లి బాగా జరిగిందని.. వచ్చిన వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటూ ప్రముఖులు అందరూ వచ్చారన్నారు. తన కుమార్తె బర్త్ డేకు చిరంజీవి అప్పట్లో వచ్చారు.. మళ్లీ పెళ్లికి కూడా రావడం ఆనందం కలిగించింది అన్నారు. తాను పెళ్లి పనులతో బిజీగా ఉన్నానని.. అందుకే ఏపీ ప్రభుత్వ సలహాదారు బాధ్యతల్ని డిసెంబర్ 10 నుంచి పూర్తి స్థాయిలో స్వీకరిస్తాను అన్నారు.
పవన్ కళ్యాణ్‌కు కూడా తన కుమార్తె వివాహానికి ఆహ్వాన పత్రికను అందించినట్లు అలీ తెలిపారు. కానీ ఆయన ఫ్లైట్ మిస్ అయ్యిందని.. లేకపోతే కచ్చితంగా వచ్చేవాళ్లని క్లారిటీ ఇచ్చారు. పవన్ వివాహానికి రావాలనుకున్నారని.. వాళ్ల సెక్యూరిటీ కూడా వచ్చి ఎలా రావాలన్నది ముందే చూసుకున్నారని.. కానీ కుదరలేదన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫోన్ రాలేకపోయాను ఏం అనుకోవద్దని ఫోన్ చేసి చెప్పారని అలీ తెలిపారు. ‘అమ్మాయి, అబ్బాయి ఉన్నప్పుడు ఫోన్ చేయండి.. మీ ఇంటికి వస్తాను’ అని పవన్ చెప్పారన్నారు. సినిమాలు ఓ వైపు, మరో వైపు సలహాదారు పదవి, షోలు కొనసాగిస్తాను అన్నారు.