TG: రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో తేలికపాటి చిరుజల్లులు కురవొచ్చునని తెలిపింది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు చలి వాతావరణం ఉంటుంది.