టాలీవుడ్ హీరోలపై నటుడు సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ్చరణ్ తనకు సోదరుడితో సమానమని.. జూ.NTR తెలుగు స్పష్టంగా మాట్లాడటం ఎంతో ఇష్టమని చెప్పారు. ప్రిన్స్ మహేశ్ బాబు తనకు స్కూల్లో జూనియర్ అని, మహేశ్ స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంటుందని ప్రశంసించారు. అల్లు అర్జున్ ‘పుష్ప2’ కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. ప్రభాస్తో మల్టీస్టారర్ చేస్తే కచ్చితంగా యాక్షన్ జానర్లోనే చేస్తానని ప్రకటించారు.