ATP: కరెంట్ బిల్ రూ.450 చెల్లించకపోవడంతో ఆగ్రహించిన లైన్మెన్ ఏకంగా మీటర్‌ను ధ్వంసం చేసిన ఘటన అనంతపురం జిల్లా కంబదూరులో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. నారప్ప అనే వ్యక్తి పోస్ట్ ఆఫీస్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. కుమారులు అందుబాటులో లేకపోవడంతో ఒక నెల విద్యుత్ బిల్లు (రూ.450) చెల్లించలేకపోయారు. లైన్మెన్ బసవరాజ్ బిల్లు విషయమై మీటర్‌ను పగలగొట్టాడు.