MLG: జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం ప్రధాన రహదారిపై క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మేకను బలిచ్చి, పసుపు కుంకుమలు, కోడిగుడ్లు, ఎర్రని అన్నం ముద్దలతో పాటు ఓ వ్యక్తికి చెందిన దుస్తులు సైతం అక్కడే పడేసి ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.