మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అహ్మద్‌నగర్ సౌత్ నుంచి పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ పోటీ చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో మనోరమ ఖేడ్కర్తో తాను విడాకులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాజా అఫిడవిట్లో కలిసే ఉన్నామని వెల్లడించటంతో వివాదాస్పదమైంది. కాగా.. అవకతవకలకు పాల్పడ్డారని ట్రైనీ IAS పూజా ఖేడ్కర్‌ను UPSC ఉద్యోగం నుంచి తొలగించింది.