రివ్యూ రైటర్లకు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చాడు. ఇటీవల ‘పొట్టేల్’ మూవీ సక్సెస్ మీట్లో రివ్యూ రైటర్లపై శ్రీకాంత్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్‌ల సంఘం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో త్వరలోనే క్షమాపణలు చెప్తానంటూ సోషల్ మీడియా వేదికగా శ్రీకాంత్ వెల్లడించాడు.