కృష్ణ: కృష్ణానది ఊబి ఇద్దరు యువకుల ప్రాణాలను తీసిన విషాద సంఘటన రెండు కుటుంబాలలో తీరని దుఃఖం మిగిల్చింది. ఐదుగురు యువకులు ఆదివారం కృష్ణా నదిలో ఈత కోసం వెళ్లిన విషయం తెలిసిందే. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన దుర్గాప్రసాద్(23), హేమంత్ కుమార్(17)లు ఈత కోసం వెళ్లి కృష్ణానది ఊబిలో మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు యువకులను మత్స్యకారులు రక్షించారు.